♦ చనిపోయిన ముగ్గురికి స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు
♦ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం
♦ ఒక్క బీడ్ జిల్లాలోనే 1200 మందికిపైగా సమరయోధులు
♦ విచ్చలవిడిగా నడుస్తున్న అవినీతి రాకెట్
ముంబై : ఒకే రోజులో ఒక్క బీడ్ జిల్లాలోనే 52 మందికి స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, అందులో మరణించిన ముగ్గురు వ్యక్తులకు కూడా స్థానం కల్పించింది. ఈ ఏడాది జూలై 5 నాటికి 88 మందికి స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఒక్క రోజులో ఒకే జిల్లాలో 52 మందికి ఆ హోదా కట్టబెట్టింది. ఆ 52 మంది లిస్టులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోయిన వారికి ప్రభుత్వం గుర్తింపునిచ్చింది.
ఈ విషయాలు సహ కార్యకర్త అనీల్ గల్గలీ ప్రభుత్వం నుంచి సేకరించిన సమాచారం ద్వారా బయటపడింది. ‘బీడ్ జిల్లా లిస్టులో శాంభాజీ అంబుజీ ఖండే, జనాబాయ్ లక్ష్మణ్ యేవ్లే, జల్సుబాయ్ తుకారాం బోసాలే అనే ముగ్గురు చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి. వాళ్లు ఏడాదికిందటే వృుతిచెందారు. వారి పేరుతో వచ్చే రూ. లక్షలను ఇంకెవరో అక్రమంగా అందుకుంటారు’ అని అనీల్ అన్నారు. ‘ స్వాతంత్య్ర సమరయోధుల జాబి తాలో పేర్లు సంపాదంచి ఎందరో అక్రమంగా లబ్ధిపొందుతున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద అవినీతి రాకెట్’ అని అన్నారు.
బీడ్‌లో ఇదో పెద్ద అవినీతి రాకెట్
‘బీడ్ జిల్లాలో ఇదో పెద్ద రాకెట్. అక్కడ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన 355 మందిపై ప్రభుత్వం విచారణ జరిపి 298 మంది నకిలీలే అని తేల్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఒకే రోజు 52 మందికి గుర్తింపునిచ్చింది. జిల్లాలో ఇప్పటికే కేంద్రం 494 మందికి, రాష్ట్రం 690 మందికి గుర్తింపునిచ్చింది. ఇప్పుడు ఇంకాా వస్తూనే ఉన్నాయి.’ అని అనీల్ గల్గలీ వివరించారు. ఈ విషయంపై సీఎం ఫడ్నవీస్‌కు, మంత్రి రంజిత్ పాటిల్ లేఖ రాసిన అనీల్, కొత్త స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునిచ్చిన వారి పేర్లను తొలగించాలని, ఈ రాకెట్ నడుపుతున్న వారిపై అవినీతి నిరోధక శాఖ ద్వారా క్రిమినల్ కేసులు పెట్టించాలని కోరారు.
లిస్టులో ఆ ముగ్గురు కూడా..
Published Fri, Jul 17 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement