సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇక్కడ నివసిస్తున్న టిబెటన్లు ఆయన పర్యటకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. టిబెటన్లపై చైనా వైఖరిని ఖండిస్తూ టిబెటన్లు చేసిన నినాదాలు మిన్నంటాయి. గురువారం రెండో రోజు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. టీవీ టవరెక్కిన యువకుడు ైచైనా అధ్యక్షుడు షీ జీపింగ్ రాజ్‌ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పిస్తున్న క్రమంలో ఓ టిబెట్ యువకుడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. టిబెట్ జెండా పట్టుకొని ధౌలాకువా వద్ద ఉన్న టీవీ టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.
నగరంలో పలుచోట్ల భద్రత పటిష్టం
టిబెటన్ల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలను చేపట్టారు. చైనా అధ్యక్షుడు, ఆయన సతీమణి సందర్శించిన ప్రాంతాలన్నింటిలో భారీగా పోలీసులు మోహరించారు. సర్ధార్ పటేల్ మార్గ్‌లో చైనా అధ్యక్షుడు బస చేసిన ఐదునక్షత్రాల హోటల్ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హోటల్ పరిసరాలల్లో ఒక కిలోమీటరుు పరిధిలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ముందస్తుగా ఇంకా పలుచోట్ల ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.టిబెటన్లు అధికంగా నివసించే మజ్నూ కా టీలా ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కొత్తవారిని ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ నివసించే వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ దారి మల్లింపు విషయమై ముందే పోలీసులు సూచనలు చేసినప్పటికీ పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
చైనా అధ్యక్షుడి పర్యటనపై నిరసన జ్వాల
Published Thu, Sep 18 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement