‘ఫాంటా మామ్’ ఆవిర్భావం | today is fanta bithday | Sakshi
Sakshi News home page

‘ఫాంటా మామ్’ ఆవిర్భావం

Published Sat, Feb 22 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

‘ఫాంటా మామ్’ ఆవిర్భావం

‘ఫాంటా మామ్’ ఆవిర్భావం


 అన్నానగర్  : శీతల పానీయదారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రముఖ సాఫ్టుడ్రింక్ ఉత్పత్తిదారు కోకో కోలా ఇండియా తన ఉత్పత్తుల్లోని ‘ఫాంటా’ పానీయం ద్వారా ‘స్నాక్ టైం- ఫాంటా టైం’ అనే నినాదంతో ఒక వినోదాత్మక యానిమేషన్ పాత్రను ‘ఫాంటామామ్’ పేరుతో అన్ని చానల్స్‌లోనూ, ఫ్రింట్ మీడియాలో ప్రచారానికి వుంచిందని కోకో కోలా మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు దేవబాత్ర ముఖర్జీ విలేకరులకు తెలిపారు.
 
 
  వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని కూడా పంచే ఈ కార్టూన్ వ్యాపార ప్రకటనను ఓ అండ్ ఎం అడ్వర్‌టైజింగ్ సంస్థ ఈసీడీ అజయ్‌గవాట్, ఎస్‌సీడీ శైలేందర్ మహాజన్ రూపొందించారన్నారు. ‘నోమూడ్’ యానిమేషన్ ఈ లఘుచిత్రాన్ని రూపొందించడంలో ఎంతో శ్రద్ధ వహించిందన్నారు. ఇందులోని గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రాయగా, సంగీతాన్ని విజయ్ ఆంటోని అందించారన్నారు.
 
 
 ఈ వ్యాపార ప్రకటన ద్వారా వచ్చే ఆదాయాన్ని సపోర్టు మై స్కూల్ ప్రోగ్రామ్, పరివర్తన్, ప్రగతి వంటి సాంఘీక సంక్షేమ పథకాలను అందచేస్తామన్నారు. ఈ సొమ్ములో కొంతభాగాన్ని ఁఫైవ్ బీ వై ట్వంటీ ఉన్నతి* అనే పథకం కింద దేశంలో సాగుతున్న మామిడి పంటల రక్షణ కోసం వినియోగిస్తామన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement