గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం గాంధీభవన్ వేదికగా జరగుతున్న ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలంతా హజరయ్యారు. గత ఆరు నెలలుగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల సమీక్షా, భవిష్యత్తు కార్యచరణపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య, సమన్వయము, ఐక్యత, కొందరు సీనియర్లు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై సమన్వయ కమిటీ చర్చ జరగనున్నట్లు సమాచారం.