శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 50,974 ఆర్జిత సేవ టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు వారపు సేవా టికెట్లను భక్తులు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లను ప్రతి నెలా మొదటి శుక్రవారం టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది.
ఆర్జిత సేవా టిక్కెట్ల వివరాలు
అర్చన - 6120
తోమాల - 120
సుప్రభాతం - 6000
అష్టదళ పాద పద్మారాధన- 80
విశేష పూజ- 1125
నిజపాద దర్శనం- 1500
కల్యాణోత్సవం- 10,125
వసంతోత్సవం- 10,750
సహస్ర దీపాలంకార సేవ- 12,350
వూంజల్ సేవ-2700
ఆర్జిత బ్రహ్మోత్సవం- 5,805