
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ధరల పెంపుపై అధ్యయనం జరుగుతోందన్నారు. అన్యమతస్థుల ఉద్యోగుల అంశంపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశంపై కోర్టు ఆదేశాలు ఇంకా అందలేదన్నారు. మరో వైపు సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానం అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సర్వదర్శన స్లాట్ విధానానికి ఆధార్ అనుసందానం చేయాలన్న నిభంధన సడలించినట్టు సింఘాల్ తెలిపారు.