తిరువళ్లూరు : అనుమతి లేకుండా క్లినిక్‌లు నిర్వహించడంతో పాటు అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వైద్యశాఖ అధికారులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల డెంగీ వేగంగా విస్తరించడంతో దాదాపు 12 మంది మృత్యవాత పడిన సంఘటన తెలిసిం దే. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం ఏర్పరచిన నేపథ్యంలో అధికారులు న కిలీ డాక్టర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పరిధిలోని వెన్‌మనముదూర్‌లో నకలీ డాక్టర్ ఉన్నట్టు అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వెన్‌మనముదూర్ గ్రామానికి చెందిన గణేషన్ కుమారుడు వసంత్‌కుమార్ ప్లస్‌టూ వరకు చదివి క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించి అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఇదే విధంగా పేరంబాక్కం గ్రామానికి చెందిన కోమగన్. ఇతను ఫిజియోథెరపీ పూర్తీ చేసి ఏడేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తని ఖీల్లో గుర్తించి వారిని సైతం అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేసిన వైద్యశాఖ అధికారులు శుక్రవారం రాత్రి మరో ఇద్దరిని అరెస్టు చేయడం జిల్లాలో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 35కు చేరింది.
ఇద్దరు నకిలీ డాక్టర్ల అరెస్ట్
Published Sun, Sep 25 2016 2:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM