మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు పొడచూపాయి. దాంతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పార్టీ నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపు నిచ్చారు.
ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు పొడచూపాయి. దాంతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పార్టీ నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపు నిచ్చారు. ఎంఎన్ఎస్కు బీజేపీ దగ్గర కావటమే ఉద్దవ్ ఆగ్రహానికి కారణం. మరోవైపు థాకరే వద్దకు బీజేపీ ఆపార్టీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీని రాయబారిగా పంపారు.
కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్ సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేశారు. దాంతో బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చలు చోటుచేసుకున్నాయి.