తిరుమలకు బయలుదేరిన గొడుగులు
Published Sat, Oct 5 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు కన్నుల పండుగే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు శుక్రవారం బయలుదేరాయి. దారి పొడవునా భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు.
తిరువ ళ్లూరు, న్యూస్‌లైన్: తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా సమర్పించే గొడుగులు చెన్నై నుంచి తిరువళ్లూరుకు చేరాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నేతలు, భక్తులు గొడుగులకు పూజలు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి కాలి నడకన గొడుగులు తీసుకెళ్లి గరుడసేవకు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది.
వీటికి ప్రతి గ్రామంలోనూ పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే గొడుగులు గురువారం రాత్రి తిరువళ్లూరు చేరాయి. ఈ సందర్భంగా భక్తులు, వీహెచ్‌పీ నేతలు, హిందువులు పెద్ద సంఖ్యలో గొడుగులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గొడుగులను ఊరేగించారు.
Advertisement
Advertisement