200 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జంటగా కనిపించే యువతీ యువకులకు పెళ్లి చేస్తామనే హెచ్చరికలకు నిరసనగా ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున పార్కులు, రెస్టారెంట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో కనిపించే జంటలకు పెళ్లి చేస్తామంటూ కొన్ని సంఘాలు హెచ్చరించాయి. దీంతో జవహర్‌లాల్ నెహ్రూ, ఢిల్లీ యూనివర్సిటీలకు చెందిన 220 మంది విద్యార్థులు పెళ్లి దుస్తులు, బ్యాండుతో ర్యాలీగా బయలుదేరారు. వారు అఖిల భారతీయ హిందూ మహాసభ కార్యాలయం మీదుగా వెళ్లడానికి ప్రయత్నించడంతో మందిర్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ హౌస్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అక్కడ కూడా విద్యార్థులు పాటలు పాడుతూ, నృత్యం, నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.
ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ముందస్తు అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో ఉన్న నిషేదాజ్ఞలు ఉల్లంఘించింనందున 220 మంది విద్యార్థులను అరెస్టు చేశామని తెలిపారు.కాగా, అరెస్టు చేసిన విద్యార్థులను సాయంత్రం వదిలిపెట్టారు. ఇదిలాఉండగా అఖిల భారత మహాసభ పిలుపుకు వ్యతిరేకంగా కొంతమంది యువకులు ‘శుద్ధ్ దేశీ రొమాన్స్: హిందూ మహాసభ స్టయిల్’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. దీనిలో హిందూ మహాసభ ఇచ్చిన పిలుపును పోస్టు చేశారు. తద్వారా విద్యార్థులను సమీకరించారు. ప్రజాస్వామ్యపు హక్కులపై జరుగుతున్న దాడికి నిరసనగా పెద్ద ఆందోళన చేయాలనుకున్నాం. ఇది వాలెంటైన్స్ డే జరుపుకోకుండా అడ్డుకుంటున్న దానిపై కాదు. ప్రేమించే మా హక్కును బహిరంగ ప్రదేశాలను ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా అడ్డుకోవాలని చూసే వారిపై పోరాటం’ అని చెప్పారు.
వాలెంటైన్స్ డే జరుపుకుంటే తప్పేమిటి?
ఈ విషయమై రితికా భాన్ అనే యువతి మాట్లాడుతూ వాలెంటైన్స్ డే జరుపుకోవడంలో తప్పేంటి? పాశ్చాత్య సంస్కృతికి చెందినది, మనకెందుకు అంటారు. కానీ, మన సంస్కృతిలో భాగం కానీ చాలా వాటిని మనం ఆనందంగా అనుసరిస్తున్నాం. వాటిలో ఏ ఒక్కదానిని కూడా వ్యతిరేకించకుండా స్వీకరించారు. కానీ, వాలెం టైన్స్ డేకి వచ్చేసరికి అడ్డంకులు కల్పిస్తున్నారు’ అని ప్రశ్నించింది.
పెళ్లి చేస్తామనే హెచ్చరికలకు వ్యతిరేకంగా ర్యాలీ
Published Sat, Feb 14 2015 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement