కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మైసూరులో చోటుచేసుకుంది.
వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన భర్త
మైసూరు: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని గాయత్రిపురకు చెందిన శివకుమార్ భార్య ప్రతిభా(38) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మంగళవారం నగరంలోని కృష్ణమూర్తి నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకెళ్లిన శివకుమార్‌కు తన భార్య కనిపించకపోయే సరికి వైద్యలను ఆరా తీశాడు.
ఆరోగ్యం విషమించడంతో కే.ఆర్.ఆసుపత్రికి తరలించామని బదులిచ్చారు. దీంతో కే.ఆర్.అసుపత్రికి వెళ్లిన శివకుమార్‌కు తన భార్య విగతజీవిగా కనిపించింది. వైద్యలను అడగ్గా ఇక్కడికి తీసుకొచ్చేలోపు ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. తన భార్య మృతికి వైద్యులే కారణమని, శస్త్ర చికిత్స చేసేటపుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని శివకుమార్ ఆరోపించారు. తన భార్య మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.