
అంధ యువతిని వివాహం చేసుకుంటున్న దృశ్యం
కోలారు: కాబోయే భార్య సౌందర్యవంతురాలు కావాలని, ఆస్తిపరురాలై ఉండాలని ఏ యువకుడైనా కోరుకుంటాడు. ఎన్నో సంబంధాలు చూసి నచ్చిన అమ్మాయినే పెళ్లాడతాడు. అయితే కళ్లు కనిపించని దివ్యాంగురాలిని జీవిత భాగస్వామిగా స్వీకరించాలంటే ఎంతో త్యాగమయమైన మనస్సు ఉండాలి. ఒక యువకుడు అంధ యువతిని వివాహం చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని అందించాడు. అలాగని అతడేమీ దివ్యాంగుడు కాదు.
ఈ అపురూపమైన ఘటన నగరంలోని గౌరిపేటలోని బయలుబసవేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం జరిగింది. బాగలకోట జిల్లా బెళగి తాలూకా గలగలి గ్రామానికి చెందిన బసవలింగప్ప సంగప్ప బాలకట్టి, సుశీలమ్మ కుమారుడు సంగమేష్ జిల్లాలోని మాలూరు తాలూకా అరళేరి గ్రామానికి చెందిన చన్నమ్మ, నంజుండస్వామి కుమార్తె ఎన్ రుద్రమ్మ అనే అంధ యువతిని వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఈ నూతన దంపతులను పలువురు అభినందించారు.