
పోరాడండి, అండగా ఉంటా
బందర్ పోర్టు బాధితులకు వైఎస్ జగన్ భరోసా
కోన: బందరు పోర్టు బాధితులకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ యిచ్చారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సమిష్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా తోడుంటామని భరోసా యిచ్చారు. కృష్ణా జిల్లా కోన గ్రామంలో గురువారం సాయంత్రం బందరు పోర్టు బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను జననేతకు వెళ్లబోసుకున్నారు.
బాలగౌరి, స్థానిక మహిళ
- మాకు మూడు ఎకరాల భూమి ఉంది
- 20- 30 ఏళ్ల క్రితం ఈ అసైన్డ్ భూమి మాకు ఇచ్చారు
- ఈ పొలం మొత్తం ఇచ్చేయాలని అధికారులు బెదిరిస్తున్నారు
- చేపలు పట్టుకుని బతుకుతున్నాం
- పల్లెటూరోళ్లం కదా మేం చేయలేమి అనుకున్నారు
- బలవంతంగా మా భూములు లాక్కోవాలని చూస్తే సత్తా చూపిస్తాం
- జగనన్న మాకు అండగా ఉన్నాడు
నాగలక్ష్మి, ఎంపీటీసీ
- ఇక్కడ జరిగే అధికారిక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడం లేదు
- మంత్రి వచ్చినా కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు
- కోటిన్నర పెట్టి పశువుల ఆస్పత్రి కట్టారు
- రెండు లక్షలతో పూర్తయ్యే ఆస్పత్రికి కోటిన్నర ఖర్చు పెట్టారు
- ఏ స్థాయిలో డబ్బులు తింటున్నారో దీనిని బట్టి అర్థమవుతోంది
- నాకున్న 2 ఎకరాలలో రొయ్యలు సాగుచేస్తున్నాం
- మా భూమి లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దుర్గయ్య, మాజీ సర్పంచ్
- నాకు 8 ఎకరాలు భూమి ఉంది, మా భాములు బలవంతంగా లాక్కుంటున్నారు
- చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏడారిని తలపిస్తున్నాయి
- ఎన్ని నద్దుల్లో మునిగిన చంద్రబాబు పాపాలు పోవు
- మా ఉసురు తప్పకుండా తగులుతుంది
- ఆడపచులు కన్నీరు పెడుతున్నారు
- డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
- పోర్టుకు 2 వేల ఎకరాలు చాలు, 5 వేల ఎకరాలు కావాలంటున్నారు
- బందర్ పోర్టు లక్ష్యం చేరుకోవాలంటే 50 ఏళ్లు పడుతుంది