చెన్నై : తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేడు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలో నిర్భంద తమిళ భాష బోధన చట్టం అమలులో ఉంది. ఈ చట్టం వల్ల తమిళనాడులో ఉన్న తెలుగు విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ ను కోరారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ.. భాష సంబంధమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి గతంలోనే తీసుకెళ్లానని, మాతృ భాషలో చదువుకోవడమే ఉత్తమం అని అన్నారు. తమిళ భాష నిర్భంద విద్యా చట్టం సరైంది కాదని, దీనిపై మరోసారి ముఖ్యమంత్రి తో మాట్లాడి సమస్య పరిష్కరానికి ప్రయత్నిస్తానని గవర్నర్ తెలిపారు.
కేతిరెడ్డి మాట్లాడుతు దేశంలో 27 రాష్ట్రలలో 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రాథమిక విద్యలో త్రిభాష విద్య విధానం అమలులో ఉన్నది. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం రెండు భాషల విద్యావిధానం అమలు చేస్తున్నారు. రాజ్యాంగం మాతృభాషలో చదువుకునే హక్కు ప్రజలకు ఇచ్చినప్పటికీ తమిళ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాల్సిందిగా గవర్నర్ ను కోరుకుంటూ... మా భాషతో పాటు వారి భాషను కూడా చదువుకోనుటకు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మా మాతృభాషలో మేము చదువుకొనే విధంగా నిర్బంధ తమిళ భాష బోధన చట్టాన్ని రద్దు చేయాలి లేకపోతే మార్పులు చేయాల్పిందిగా కోరుకుంటున్నాం అన్నారు.
వినతి పత్రంలోని 6 అంశాలు...
1) తమిళనాడు రాష్ట్రంలో నిర్భంద తమిళ భాష బోధన చట్టం రద్దు చేయడం.
2) తమిళనాడులో తెలుగు అకాడమీ స్థాపించుటకు చర్యలు చేపట్టాలి.
3) తమిళనాడు రాష్ట్రంలో జనాభా లెక్కలను తిరిగి లెక్కించి తెలుగు వారి సంఖ్యను, అలాగే మైనారిటీ ప్రజల సంఖ్యను స్పష్టంగా తెలియచేయాలి.
4) రోడ్లకు ఉన్న పేర్లలో కులాల పేర్లను చట్టం చేసి తీసివేశారు. కానీ ఒక రోడ్డు పేరులో కులం పేరును బ్రాకెట్‌లో ఉంచారు. అలాగే తెలుగు వారి పేరున్న చోట కూడా కులం పేరు బ్రాకెట్‌లో పెట్టాలి.
5) చెన్నైనగరంలో తెలుగు ప్రజలు ఉంటున్న ప్రాంతాలలో మరుగుదొడ్లు, కనీస వసతులు ఏర్పటు చేయాలి.
6) పారిశుధ్య కార్మికుల వెల్ఫేర్ కొరకు వెల్ఫేర్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment