టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది.. | Apple wins Australia ruling to retain Apple Pay dominance | Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది..

Published Fri, Mar 31 2017 3:24 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది.. - Sakshi

టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది..

ఆస్ట్రేలియన్ బ్యాంకులతో జరుగుతున్న అతిపెద్ద రెగ్యులేటరీ పోరాటంలో టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది.  ఆపిల్ కు అనుకూలంగా ఆస్ట్రేలియన్ కంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్(ఏసీసీసీ) తీర్పునిచ్చింది. దీంతో తన కాంటాక్ట్లెన్స్ పేమెంట్స్ టెక్నాలజీపై పూర్తి హక్కులు దానికే సొంతమయ్యాయి. అసలు ఆస్ట్రేలియన్ బ్యాంకులకు, ఆపిల్ కు ఉన్న వివాదమేమిటంటే... ఆస్ట్రేలియాలోని నాలుగు దిగ్గజ బ్యాంకులు ఎలాంటి చెల్లింపులు లేకుండా తమ సొంత యాప్స్కు ఆపిల్ పే టెక్నాలజీని వాడుకోవడానికి అనుమతివ్వాలని కోరుతున్నాయి. దానికి ఆపిల్ ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై కామన్వెల్త్ బ్యాంకు ఆఫ్ ఆస్ట్రేలియా, వెస్ట్ప్యాక్ బ్యాంకింగ్ కార్పొరేషన్, నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు, బెండిగో బ్యాంకులు వారి కన్జ్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాయి. అయితే ఈ బ్యాంకుల ప్రతిపాదనను ఆ కమిషన్ కూడా కొట్టిపారేసింది.  అందరూ కలిసి ఆపిల్ ను బాయ్ కాట్ చేయడం, పోటీవాతావరణాన్ని తగ్గించనట్టేనని ఏసీసీసీ శుక్రవారం పేర్కొంది. 
 
అసలు బ్యాంకులకు కావాల్సిందేమిటి?
ఆపిల్ ఐఫోన్లలో వాడే కాంటాక్ట్లెన్స్ పేమెంట్ టెక్నాలజీని తమ సొంత యాప్స్ లో వాడుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. వారు కోరుతున్న అగ్రిమెంట్ కు ఆపిల్ ఒప్పుకోకపోతుండటంతో బ్యాంకులు తమ కార్డులకు ఆపిల్ పేకు అనుమతివ్వడం లేదు. ఆస్ట్రేలియా క్రెడిట్ కార్డు మార్కెట్లో మూడింట రెండువంతులు ఈ బ్యాంకులదే హవా. దీంతో బ్యాంకులకు, ఆపిల్ కు వివాదం వచ్చింది. కమిషన్ ఒకవేళ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చి ఉంటే మార్కెట్లో ఉన్న పోటీని అదే తగ్గించినట్టు అయ్యేది. ఆస్ట్రేలియా బ్యాంకులపై ఆపిల్ విజయం సాధించడం అతిపెద్ద విక్టరీనేనని టెక్ వర్గాలంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement