ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ తో ఆ ఫోన్ విక్రయం | Micromax Canvas 2 (2017) With 1-Year Free Internet to Go on Sale in India Today | Sakshi
Sakshi News home page

ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ తో ఆ ఫోన్ విక్రయం

Published Wed, May 17 2017 11:12 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ తో ఆ ఫోన్ విక్రయం

ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ తో ఆ ఫోన్ విక్రయం

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్... గతవారం హెడ్ లైన్స్ లో ఒకటిగా నిలిచింది. డేటా వాడకం పెరుగుతున్న తరుణంలో తమ ఫోన్ కొంటే ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ టెల్ ఇంటర్నెట్ అందిస్తామంటూ మైక్రోమ్యాక్స్ ప్రకటించడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులంతా ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు విక్రయానికి వస్తుందా అని ఆసక్తి చూపారు. అద్భుతమైన బంపర్ ఆఫర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్  నేటి నుంచే విక్రయానికి వస్తోంది. భారత్ లోని అన్ని రిటైల్ అవుట్ లెట్లలో బుధవారం నుంచి ఈ ఫోన్ విక్రయించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఉచిత ఇంటర్నెట్ తో పాటు ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కు ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను కూడా ఫ్రీ అందించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 
 
 ఎయిర్ టెల్ 4జీ సిమ్ కార్డు ప్రీలోడెడ్ తో ఇది మార్కెట్లోకి వస్తోంది. గురువారం లాంచ్ అయిన ఈ ఫోన్ ధర 11,999 రూపాయలు. ఈ ధరలో కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5ను ఆఫర్ చేయడం ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ. ఏడాదిలో స్క్రీన్ రీప్లేస్ మెంట్ ప్రామిస్ ను మైక్రోమ్యాక్స్ ఆఫర్ చేస్తోంది. డ్యూయల్ సిమ్ కాన్వాస్ 2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో రన్ అవుతుంది. 5 అంగుళాల డిస్ ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్,  13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, ఆటో ఫోకస్, 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 64జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ, 3050ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement