నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై
నిజాం కాలేజీలో జియో హైస్పీడ్ వై-ఫై
Published Tue, Apr 4 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
హైదరాబాద్ : నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యాసంస్థ నిజాం కాలేజీ డిజిటల్ క్యాంపస్ గా మారిపోయింది. టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, నిజాం కాలేజీలో జియోనెట్ హై స్పీడ్ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం నిజాం కాలేజీ ఆడిటోరియంలో ఈ సర్వీసులను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రర్ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
నిజాం కాలేజీ లాంటి పాత విద్యాసంస్థ సరికొత్తగా డిజిటల్ సేవలతో ముందుకు దూసుకెళ్లడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ రెడ్డి అన్నారు. ఈ వైఫై సేవలను స్టాఫ్, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జియో డిజిటల్ క్యాంపస్ పేరిట, రిలయన్స్ జియో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో హై-స్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 500కు పైగా కాలేజీలో జియోనెట్ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఈ సేవలనందిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ ఈవెంట్లో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్ బాలబ్రహ్మం చారీ, జియో ప్రతినిధులు రమణ సురభి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement