సారంగాపూర్ (కరీంనగర్) : తల్లితో గొడవ పడి ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎం.అఖిల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఇంట్లో ఏ పనీ చేయవని, తిని కూర్చుంటావని శుక్రవారం సాయంత్రం అఖిలను తల్లి మందలించింది. శనివారం ఉదయం కూడా పని విషయమై తల్లీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు బయట ఉన్న సమయంలో అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లితో గొడవపడి విద్యార్థిని ఆత్మహత్య
Published Sat, Feb 27 2016 3:50 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement