
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. వడదెబ్బతో సోమవారం 11 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో గాలి నర్సయ్య(28), నకిరేకల్‌లో సరికొండ జానయ్య (40), అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వలో చింత సైదులు(34), బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జి.యాదమ్మ(65), కోదాడలో స్వాతంత్య్ర సమరయోధురాలు పోనుగోటి రంగనాయకమ్మ(95), త్రిపురారం మండలం రాజేంద్రనగర్‌లో ఇస్లావత్ కృష్ణ(32), మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఎస్టీ కాలనీలో మట్టె యాకమ్మ(60), కొత్తపేట సంతులాల్ కోడ్‌తండాలో బానోతు సీతారాం(50), జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో మామిడిశెట్టి లస్మయ్య (60), సారంగాపురం మండలం దగ్గులమ్మ ప్రాంతానికి చెందిన జైనపురం లక్ష్మీనారాయణ (42), సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన జోగన్నగారి చంద్రారెడ్డి(58) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment