కరీంనగర్ : కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఓ గొర్రెల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న సంజ కొమరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి, సుమారు 130 గొర్రెలను అపహరించుకు వెళ్లారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గతంలోనూ పెద్దపల్లి డివిజన్లో ఇదే తరహాలో హత్య జరిగింది. కాగా గొర్రెల కాపర్లను హతమార్చి, గొర్రెలను ఎత్తుకు పోవటంతో మిగతా గొర్రెల కాపర్లు భయాందోళనకు గురవుతున్నారు.