ఆత్మకూరు ఎస్: నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో బుధవారం పెట్టిన మధ్యాహ్న భోజనం తినగానే విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.