
టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
రామగుండం (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామగుండం గౌతంనగర్‌లోని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వగృహంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
నియోజకవర్గంలోని కుందనపల్లి, ఎలుకలపల్లి, మద్దిరాల, ఆకెనపల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు కలిపి దాదాపు 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వీరిలో పలు పార్టీలకు చెందినవారు, ఇండిపెండెట్లు ఉన్నారు.