మూడేళ్లలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్
► ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
► ‘కుడి’ చెరువులో మిషన్‌కాకతీయ పనులకు శంకుస్థాపన
► సమీకృత వసతిగృహం ప్రారంభం
చొప్పదండి : మేనిఫెస్టోలో చెప్పినట్లు పగటిపూట తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తున్నామని అయితే రైతుల కోరిక మేరకే రాత్రి పూట మూడు గంటలు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రానున్న మూడేళ్లలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. చొప్పదండిలోని కుడి చెరువుపై మిషన్‌కాకతీయ పనులకు గురువారం ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
మిషన్‌కాకతీయ పనుల్లో నాణ్యత పాటించాలని సూచిం చారు. అనంతరం చొప్పదండిలో రూ.3.50కోట్లతో నిర్మిం చిన సమీకృత బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. ఎంపీపీ గుర్రం భూంరెడ్డి, జెడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబ య్య, తహసీల్దార్ బైరం పద్మయ్య, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌గుప్తా, షఫీమి యా, వైస్‌ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీటీసీలు రాజశేఖర్, తి రుపతి, ఉపసర్పంచ్ మంద చందు పాల్గొన్నారు.