రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 3,618 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైద్యులు, నర్సులతో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులనూ భర్తీ చేయనుంది. ఇందులో ఇప్పటికే 2,118 పోస్టులకు అనుమతివ్వగా.. తాజాగా మరో 1,500 పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ నియామకాల బాధ్యతను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు అప్పగించాలని నిర్ణయించినట్లు, ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశమున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం పోస్టుల్లో దాదాపు వెయ్యి వరకు వైద్య పోస్టులున్నట్లు అంచనా. మిగతావి నర్సులు, పారామెడికల్ పోస్టులు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు ఇతర ఆస్పత్రుల వరకు మొత్తంగా 5,302 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలోనే వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. అందులోనే 3,618 పోస్టులను భర్తీకి చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు
గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు మంజూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి 9, కాకతీయ మెడికల్ కాలేజీకి 36 సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. 2017– 18 పీజీ అడ్మిషన్ల నుంచే సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గాంధీలో ఎంఎస్ సర్జరీలో 6 సీట్లు, ఎంఎస్ ఈఎన్‌టీలో 2, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒక సీటు..కాకతీయలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో 11 సీట్లు, ఎంఎస్ జనర ల్ సర్జరీలో 9, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 6, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒకటి, ఎంఎస్ ఓబీజీలో 6, ఎంఎస్ పీడియాట్రిక్స్‌లో 3 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది.
3,618 వైద్య పోస్టుల భర్తీ
Published Thu, Mar 30 2017 4:26 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement