విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ కింద 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాన్స్ కో, జెన్ కో ఉద్యోగులకు దీన్ని వర్తింపజేయనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్‌మెంట్, మూడు వెయిటేజీలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఇంధనశాఖ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
మొదట్లో 27.5 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సీఏం కేసీఆర్ అనుకున్నారు. అయితే దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు ఎన్టీపీసీ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఫిట్‌మెంట్ తక్కువ ఇవ్వడం సరికాదని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీంతో ఉద్యోగులు కోరిన మేరకు 35 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇంధనశాఖకు సీఎం కేసీఆర్ సూచించారు. చివరకు 30 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేశారు.