ఆకాశవీధిలో...
- ట్రాఫిక్కష్టాలకు చెక్
- నగరంలో 4 ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు
- జిల్లా రహదారులతో అనుసంధానం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల మెరుగుదలలో భాగంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ప్రవేశించే నాలుగు ప్రధాన రోడ్లను ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే మార్గాలను పీవీ ఎక్స్‌ప్రెస్ హై వే తరహాలో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నగరంలోని కీలకమైన ప్రధాన కూడ లికి చేరేవరకు ఆయా మార్గాలను ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే (వంతెన)లుగా అభివృద్ధి చేస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాలకు త్వరితగతిన చేరుకోవడానికి సులభతరం అవుతుందని సీఎం భావిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాహానాలు ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్ల పైనుంచి ప్రయాణించడం వల్ల కింద ట్రాఫిక్ యథావిధిగానే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హై వేల నిర్మాణం వల్ల నగర శివార్లలో ట్రాఫిక్ ఇబ్బందులకు కూడా ఓ పరిష్కార మార్గంగా ఇవి దోహదపడతాయని సీఎం అం చనా వేస్తున్నారు.
శివారు ప్రాంతాల్లోని రోడ్లు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు గంటన్నర వ్యవధిలోనే చేరుకున్నప్పటికీ అక్కడినుంచి నగరంలోకి ప్రవేశించడానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. దీనివల్ల జిలాల్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులే గాకుండా శివారు ప్రాంత ప్రజలు కూడా ట్రాఫిక్ సమస్యతో నానా ఇబ్బం దులు పడుతున్నారు.
దీనికి పరిష్కార మార్గంగా జిల్లా కేం ద్రాల రహదారులకు అనుసంధానంగా నగరంలో నాలుగు ఎక్స్‌ప్రెస్ హై వేలను నిర్మిం చనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఎక్స్‌ప్రెస్ హై వేల అభివృద్ధిని చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం భావిస్తున్నారు.
ఎలివేటెడ్ మార్గాలివే.
వరంగల్ నుంచి వచ్చే వారి కోసం: ఘట్‌కేసర్ వద్దనున్న
ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్డు వరకు.
కరీంనగర్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం:
శామీర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్ నుంచి జూబ్లీబస్ స్టేషన్ వరకు.
బోధన్, మెదక్ నుంచి వచ్చే వారి కోసం:
దుండిగల్ ఓఆర్‌ఆర్ నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ వరకు.
నల్గొండ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం: పెద్దఅంబర్‌పేట
ఓఆర్‌ఆర్ నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వరకు.