
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5,500 మంది చిన్నారులు గాంధీజీ వేషధారణలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు.