సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం హోటల్ మేరియట్‌లో జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. వ్యవసాయం, మహిళా సంఘాలకు రుణాలు, ప్రాధాన్య రంగాలకు ఏ మేరకు రుణాలు ఇవ్వాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. దాదాపు రూ. 60 వే ల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
ఇందులో వ్యవసాయ రుణాలు 28 వేల కోట్లు, మహిళా సంఘాలకు ఐదువేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలో పొందుపర్చారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. రుణ మాఫీ వివరాలు అందించాలని మాత్రమే కోరారు. కాగా, శుక్రవారం జరిగే సమావేశంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ మేరకు రుణాలు అందిస్తారో ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొంటారు.
60 వేల కోట్లతో వార్షిక రుణప్రణాళిక!
Published Fri, Aug 8 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement