హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనకు కృషి చేస్తామని లేబర్ కమిషనర్ ఆర్ వీ. చంద్రవదన్ తెలిపారు. పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న మాఫియాను అడ్డుకోవడానికి నెలకు రెండుసార్లు కర్మాగారాల్లో తనీఖీలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.
పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిచారు. తాజాగా గురువారం 86 మంది బాలలను పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బోగీలో బీహార్ వెళ్లడానికి ఏర్పాటు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను బలవంతంగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.