native place
-
Mahesh Babu: మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి స్వస్థలమేదో తెలుసా?
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ సతీమణి, హీరో మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదఛాయలు అలుము కున్నాయి. మండలంలోని ముసలిమడుగు ఆమె స్వగ్రామం. కృష్ణను వివాహమాడాక పిల్లలు రమేష్‌బాబు, మహేష్‌బాబులతో తరచుగా ముసలిమడుగు వచ్చివెళ్లేవారు. ఆమె ఎప్పుడు వచ్చినా అందరినీ అప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ముసలిమడుగులో ఇందిరాదేవి పేరిట ఇల్లు ఉంది. పక్కనే ఉన్న లక్ష్మీపురంలో ఇందిరాదేవితోపాటు ఆమె కుమారులు, కుమార్తెల పేరిట వ్యవసాయ భూములున్నాయి. ఇందిరాదేవి పేరిట ఉన్న ఇంటి స్థానంలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం వసతిగృహం నిర్మించాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రతువును మహేష్‌బాబు నిర్వహించారు. (చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్) -
లవ్లీనాకు వెల్కం : శరవేగంగా పనులు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు ఒలింపిక్స్ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. మరోవైపు సెమీ ఫైనల్ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు. కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. కాగా టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు
సాక్షి, హైదరాబాద్: అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీల రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో.. ► గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో రైళ్లు, బస్సు లతో పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. ► తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. ► ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. ► లాక్డౌన్ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు. ఇళ్లకు చేరేదెలా? ► ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్‌లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. ( చదవండి: నెగెటివ్‌గా తేలినా మళ్లీ టెస్టు బెటర్: నిపుణులు ) -
చురుగ్గా కూలీల వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఆందోళనతో స్వస్థలాల బాటపట్టిన వలస కూలీలను సొంత ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైం ది. మరో 40 రైళ్లలో ఈ కూలీ టలందరిని స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భారతదేశా నికి చెందిన లక్షలాది మంది వలస కార్మికుల వివరాలు సేకరించాల ని డీజీపీ కార్యాలయం ఆదేశించడంతో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లు ఇదే పనిలో పడ్డాయి. విషయం తెలుసుకున్న పలువురు కూలీలు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి బారులు తీరుతున్నారు. వలస కూలీలకు సంబంధిం చిన ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు చూపించి నమోదు చేసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఏయే ఠాణా పరిధిలో ఏ రాష్ట్రం కూలీలు అధికంగా ఉన్నారో తేల్చి వారిని ఉన్నతాధికారు లు సూచించిన రైల్వే స్టేషన్‌కు పంపేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నా రు. ఆదేశాలు వచ్చిన వెంట నే తరలించేందుకు స్థానికం గా ప్రైవేటు బస్సుల యాజ మాన్యాలతోనూ పోలీసులు మాట్లాడి ఉంచారు. డేటా మొత్తం నిక్షిప్తం.. కూలీలకు సంబంధించిన వివరాలన్నీ ప్రతీ పోలీసు స్టేషన్ నుంచి ఎస్పీ/ కమిషనరేట్ కార్యాలయాలకు అక్కడ నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లాయి. అక్కడ ఐటీ విభాగంలో కూలీల డేటా నిక్షిప్తమవుతుంది. కూలీల చిరునామాల ఆధారంగా వారి సొంత జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఈ వివరాలు అందజేస్తారు. నిరక్షరాస్యులు, స్థానిక భాష రాని వలసకూలీలు పోలీసు స్టేషన్‌కి వెళ్లి పేరు నమోదు చేసుకుంటే..ప్రభుత్వమే ప్రత్యే క రైలులో పంపుతుందన్న విషయంపై వారికి సమాచారం లేదు. వీరిని రాష్ట్రం దాటకుండా అడ్డుకుని ప్రత్యేక రైళ్ల ద్వారా పంపే బాధ్యతను పోలీసులే తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంత రిస్క్ అవసరమా !
సాక్షి, తూప్రాన్ : లాక్డౌన్ గత 40 రోజులకు పైగా కొనసాగుతుండడంతో వలస కార్మికులకు ఉపాధి కరువై తమ సొంత గూటికి చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. లారీల్లో పైన ప్రమాదం అంచును ప్రయాణం సాగిస్తున్నారు. కనీసం వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చావైనా... బతుకైనా తమ సొంత ఊరీలోనే అంటూ వలస కార్మికులు ప్రయాణం సాగిస్తున్నారు. వందలాది కిలోమీటర్ల దూరంను సైతం లెక్కచేయకుండా తమ పిల్లపాపలతో నడక సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్గాడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టోల్‌ప్లాజా వద్ద గూమిగుడుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీల్లో వారు ప్రమాదం అంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి, వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఈసారి షమీ సొంతూళ్లో...
ఆమ్రోహా: భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. షమీ సొంతూరైన ఉత్తరప్రదేశ్‌లోని సహస్ గ్రామానికి వెళ్లేందుకు తనకు రక్షణగా రావాలంటూ డిడౌలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామ్‌సింగ్ కటారియాను కోరింది. సహస్ చేరిన అనంతరం షమీ ఇంటి తాళాన్ని పగులగొట్టాలని జహాన్ పోలీసుల్ని డిమాండ్ చేసింది. అయితే ఆమె డిమాండ్‌ను వారు తోసిపుచ్చారు. ఇంట్లో ఎవరూ లేనందున తాళం పగలగొట్టేందుకు నిరాకరించామని కటారియా స్పష్టం చేశారు. ఆమెతో పాటు తన రెండేళ్ల కూతురు, లాయర్ జాకీర్ హుస్సేన్ ఉన్నట్లు ఆయన చెప్పారు. జహాన్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ గ్రామానికి వచ్చిందని అక్కడే నివాసముంటున్న షమీ బంధువు మొహమ్మద్ జమీర్ తెలిపారు. ఆమెను తన ఇంట్లోకి ఆహ్వానించానని ఆయన చెప్పారు. కానీ షమీ సొంతూరు వెళ్లిన కారణాన్ని చెప్పేందుకు హసీన్ జహాన్ నిరాకరించింది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది. -
స్వస్థలాలకు మరో 86 మంది బాల కార్మికులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనకు కృషి చేస్తామని లేబర్ కమిషనర్ ఆర్ వీ. చంద్రవదన్ తెలిపారు. పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న మాఫియాను అడ్డుకోవడానికి నెలకు రెండుసార్లు కర్మాగారాల్లో తనీఖీలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిచారు. తాజాగా గురువారం 86 మంది బాలలను పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బోగీలో బీహార్ వెళ్లడానికి ఏర్పాటు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను బలవంతంగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. -
స్వస్థలాలకు 82 మంది బాల కార్మికులు
హైదరాబాద్: పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో గాజు తయారీ పరిశ్రమల్లో పనిచేస్తూ పోలీసులకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం రామంతపూర్ డాన్‌బాస్కోలో ఆశ్రయం పొందుతున్న 271 మంది బాలకార్మికుల్లో మొదటివిడతగా 82 మందిని ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక బోగీలో అధికారులు పంపించారు. వీరికి పర్యవేక్షకులుగా డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి, ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బాలల సంరక్షణాధికారులు వెళ్లారని జిల్లా బాలల సంరక్షణాధికారి ఇంతియాజ్ తెలిపారు. కాగా, చికెన్ఫాక్స్తో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రెస్క్యూహోమ్లోని 12 మంది బాలకార్మికులు కోలుకున్నారు. వారందరినీ మంగళవారం డిశ్చార్జ్ చేసి పంపేశారు. వీరిని బుధవారం వారి స్వస్థలాలకు పంపనున్నారు. అదృశ్యమైన కొడుకు కోసం ఆరా! హైదరాబాద్: బాలకార్మికులకు విముక్తి కల్పించారని తెలుసుకున్న గుంటూరుకు చెందిన షేక్‌బాజీ దంపతులు తప్పిపోయిన తమ కుమారుడు షేక్ మహ్మద్ కోసం ఇక్కడికి వచ్చారు. పాట్నా రైలులో ప్రయాణిస్తున్న బాలల్ని, అధికారులను కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే 97030 39115 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకున్నారు. -
సొంత రాష్ట్రానికి తరలిన బాలకార్మికులు
హైదరాబాద్: పాత బస్తీలోని అనేక పరిశ్రమల్లో ప్రమాదకర పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం రామంతాపూర్ డాన్‌బాస్కోలో ఆశ్రమం పొందుతున్న 271 మంది బాల కార్మికులలో మొదటి విడతగా 82 మందిని ఉదయం 10 గంటలకు పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో పంపించారు. రైలులో వెళుతున్న బాల కార్మికులకు పర్యవేక్షకులుగా డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి, ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బాలల సంరక్షణాధికారులు వెళ్లారని జిల్లా బాలల సంరక్షణాధికారి ఇంతియాజ్ తెలిపారు. పాట్నాలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారుల సమక్షంలో ఈ బాల కార్మికులను వారి వారి తల్లిదండ్రులకు బాలల రక్షణాధికారులు అప్పగిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం డాన్‌బాస్కోలో ఉన్న 129 మంది బాల కార్మికులను వచ్చే వారం రోజుల్లో వారి వారి స్వస్థలాలకు తరలిస్తామన్నారు. -
సీఎం సొంత నియోజకవర్గంలో జల్లికట్టు