సాక్షి, తూప్రాన్ : లాక్‌డౌన్ గత 40 రోజులకు పైగా కొనసాగుతుండడంతో వలస కార్మికులకు ఉపాధి కరువై తమ సొంత గూటికి చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. లారీల్లో పైన ప్రమాదం అంచును ప్రయాణం సాగిస్తున్నారు. కనీసం వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చావైనా... బతుకైనా తమ సొంత ఊరీలోనే అంటూ వలస కార్మికులు ప్రయాణం సాగిస్తున్నారు. వందలాది కిలోమీటర్ల దూరంను సైతం లెక్కచేయకుండా తమ పిల్లపాపలతో నడక సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్గాడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టోల్‌ప్లాజా వద్ద గూమిగుడుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీల్లో వారు ప్రమాదం అంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి, వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment