ముకరంపుర : జీవనభృతి కోసం ఎదురుచూస్తున్న బీడీకార్మికుల్లో ప్రభుత్వం కొందరి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా సర్వే ద్వారా విచారణ పూర్తి చేసిన సర్కారు 88,202 కార్మికులనే జీవనభృతికి అర్హులుగా గుర్తించింది. వీరికి మార్చి నుంచి ప్రతి నెల రూ.వెరుు్య అందించనుంది. సోమవారం రాయికల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీకార్మికులకు జీవనభృతి పంపిణీని ప్రారంభించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
బీడీకార్మికుల అర్హుల గుర్తింపుకు సమగ్ర సర్వే లింకు పెట్టడంతో లబ్దిదారుల సంఖ్య తగ్గిపోయింది. ఈక్రమంలో జిల్లా అంతటా బీడీకార్మికుల పోరుబాట పట్టారు. తాజాగా ముఖ్యమంత్రి అర్హత ఉన్నా భృతి రాలేని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఆశలు చిగురిస్తున్నారుు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,63,032 మంది బీడీ కార్మికులున్నారు. కార్మిక శాఖ లెక్కల ప్రకారం దాదాపు 1,40,000 మంది బీడీ కార్మికులున్నారు. బీడీ కార్మికులుగా విరమణ పొంది ప్రావిడెంట్ ఫండ్ కింద పింఛన్ పొందుతున్న వారు 23,538 మంది వరకు ఉన్నారు. 2014 ఫిబ్రవరి 28 నాటికి 18 సంవత్సరాల వయస్సు పైగా ఉన్నవారిని అర్హులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులుగా నమోదైన వారినే విచారించి అర్హులుగా గుర్తించారు.
గతనెల 18 నుంచి 27 వరకు జిల్లావ్యాప్తంగా 67 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన బీడీ కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో 40,104 మంది బీడీ కార్మికులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. మిగిలిన 1,22,928 మందిని సర్వే ద్వారా విచారణ పూర్తి చేసి 88,202 మందిని జీవనభృతికి అర్హులుగా గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వేలో లేనివారు, బీడీ కార్మికులుగా విరమణ పొంది పీఎఫ్ ద్వారా ప్రతి నెల పింఛన్ పొందుతున్నవారు, ఆసరాలో అర్హులైన వారు, ఇంట్లో ఇద్దరికి పింఛన్ రావడం వంటి కారణాలతో 34,718 మందిని అనర్హులుగా తేలారు. అర్హులైన 88,202 మందికి రూ.1.67 కోట్లను మార్చిలో పంపిణీ చేసేందుకు ప్రొసీడింగ్‌లు జారీ చేశారు.
జిల్లాలో అత్యధికంగా జగిత్యాల డివిజన్‌లో 41,413 మందికి, మున్సిపాలిటీల్లో 13,223 మంది బీడీ కార్మికులకు భృతికి అర్హత పొందారు.
సిరిసిల్ల డివిజన్‌లో 19,667, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6.936 మంది బీడీ కార్మికులను అర్హులుగా గుర్తించారు.
కరీంనగర్ డివిజన్‌లో 5,323 మంది, పెద్దపెల్లి డివిజన్‌లో 913 మందిని, జిల్లాలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో 20,886 మంది బీడీ కార్మికులకు భృతి ఇవ్వనున్నారు.
పీఎఫ్ ఉన్నప్పటికీ ఎస్‌కేఎస్ సర్వేలో బీడీ కార్మికులుగా పేర్లు నమోదు కాకపోవడంతో జీవనభృతి సర్వేలో సదరు కార్మికుల వివరాల నమోదుకు అధికారులు తిరస్కరించడంతో ఆందోళన తీవ్రతరమవుతోంది. డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ ప్రభుత్వ నిబంధనల మేరకు సమ గ్ర కుటుంబ సర్వే ఆధారంగానే అర్హులను గు ర్తించామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మే రకు మిగిలిన వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. పీఎఫ్ లేని వారు కూడా సమగ్ర సర్వే లో బీడీ కార్మికులుగా నమోదై ఉన్నారు. వీరిని కూడా జీవనభృతికి అర్హులుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 2లక్షల మంది బీడీ కార్మికులున్నట్లు కార్మిక వర్గాలు చెబుతున్నా అందులో సగం మందికి కూడా భృతి అందకుండా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కార్పొరేట్ శక్తుల అనుకూల బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారుల అనుకూలంగా ఉంది. బీజేపీ అంకెలగారడీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా సంపన్నులకు రాయితీలను కట్టబెట్టడం బాధాకరం. తొలి బడ్జెట్‌లోనే ధరలు దించే దిశగా కాని, ఉపాధి పెంచే దిశగా కాని చర్యలు లేకపోవడం గమనార్హం. జిల్లాకు సంబంధించి ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఊసే లేదు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి
బీజేపీ వైఖరి తేటతెల్లం
కాంగ్రెస్ విధానాలతో విసిగి వేజారిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఓటేస్తే తొలి బడ్జెట్‌లోనే ఆ పార్టీ వైఖరి బయటపడింది. సామాన్యులను, రైతులను, మధ్య తరగతి ఉద్యోగులను బడ్జెట్ నిరాశ పరిచింది. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. బీజేపీ ఎవరి ప్రయోజనాలు కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, యువతకు ఉపాధి పెంచేందుకు ఎలాంటి చర్యలూ లేకపోవడం విడ్డూరం.
- సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
హర్షణీయం
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, రైలు, రోడ్లు, నీ టిపారుదల, ఉపాధిహామీ, విద్యుత్తు ఉత్పాదక తయారీ రంగాభివృద్ధి, ఉద్యోగాల కల్ప న, నైపుణ్యతల పెంపునకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. ప్రతి ఒక్కరికి సాంఘిక భద్రత, రైతులకు రుణ పెంపు, నగదు రహిత లావాదేవీలకు ప్రాముఖ్యత ఇవ్వడం సముచితంగా ఉంది. నల్లధనాన్ని అరికట్టే చర్యలు, ప్రాచీన వారసత్వ పరిరక్షణ, రాష్ట్రాలకు అధిక నిధుల కేటాయింపు, సూక్ష్మ రుణాలకు ప్రత్యేక బ్యాకింగ్ వ్యవస్థను ప్రతిపాదించడం ప్రగతిశీల బడ్జెట్ అని చెప్పవచ్చు.
- పి.సుగుణాకర్‌రావు, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి
సామాన్యుల నడ్డివిరిచే బడ్జెట్
కేంద్ర బడ్జెట్ సామాన్యులకు గుదిబండగా మారింది. కార్పొరేట్ శక్తులకు అండగా ఉం డేందుకు బీజేపీ తహతహలాడుతోంది. ప్ర పంచబ్యాంకు నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు పోతున్నదనేది వాస్తవం. ధరలు ఒకవైపు పెరుగుతూంటే ద్రవ్యోల్బణం లేదనడం వాస్తవాన్ని అంగీకరించక అంకెలతో బుకాయించడమే అవుతుంది.
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి
88,202 మంది బీడీకార్మికులకే జీవనభృతి
Published Sun, Mar 1 2015 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement