ఇక ఉత్తర తెలంగాణలో కరువు ఉండదు : పోచారం
బాన్సువాడ టౌన్: ఏప్రిల్ 1 నుంచి రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ను అందించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ఫీడర్, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు.
గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రూ.100కోట్లతో వ్యవసాయాధారిత ఆయిల్ ఫాం, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ మండలాల పసుపు రైతుల కోసం రూ. 30 కోట్లతో స్పైస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలో శాశ్వతంగా కరువు లేకుండా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.