5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణీ | 9th month pregnant lady runs 5 kilometers | Sakshi
Sakshi News home page

5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణీ

Published Sun, Apr 26 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణీ

5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణీ

కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల గర్భిణీ 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమేకాదు, 'తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలో చేరుకుని రికార్డు నెలకొల్పింది.

ప్రత్యక్షంగా తిలకించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు గుర్తింపు పత్రం అందజేశారు. నిండు గర్భిణీగా ఉండి, 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తటం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమమని తెలిపారు. గిన్నిస్ బుక్ నిర్వాహకులకు కూడా సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి భర్త రవీందర్ కూడా క్రీడాకారుడే. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ వారంలోనే ఆమెకు కాన్పు కానుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement