పండిన పంటకు గిట్టుబాటు ధర లేక...అప్పు తీర్చే మార్గం కానరాక ఆ రైతు పంట చేలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఖమ్మం: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక...అప్పు తీర్చే మార్గం కానరాక ఆ రైతు పంట చేలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలప్పేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన పాలెపు పుల్లారావు (40) తనకున్న ఎకరం పొలంలో మిర్చి సాగు చేశాడు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పత్తి ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. ధర కూడా తక్కువగానే ఉంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు, కౌలు చెల్లింపు కోసం తీసుకొచ్చిన అప్పులు రూ.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు శనివారం రాత్రి మిరపతోటలో పురుగుమందు తాగి తనువు చాలించాడు.
(తల్లాడ)