గుడ్లు తేలేస్తున్నయ్ | about 40 lack birds died at poultry forms because of heavey temparature | Sakshi
Sakshi News home page

గుడ్లు తేలేస్తున్నయ్

Published Mon, May 25 2015 3:01 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

గుడ్లు తేలేస్తున్నయ్ - Sakshi

గుడ్లు తేలేస్తున్నయ్

- వారంలో 40 లక్షల కోళ్లు మృతి 

- చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు విలవిలలాడుతున్నాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలుండగా వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్ కోళ్లు, 2 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

అటువంటి జాగ్రత్తలతో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పైగా బయట ఉష్ణోగ్రతలకు మించి కోళ్ల ఫారాల్లో రేకుల షెడ్డుల కారణంగా మరో రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలుంటాయి. ఇంత భారీ వే డి కారణంగా గత వారం రోజుల్లో దాదాపు 40 లక్షల కోళ్లు మృతిచెందాయి. దీంతో కోళ్ల వ్యాపారులకు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. వాటికి బీమా సౌకర్యం లేకపోవడంతో నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి వస్తోందన్నారు. మరోవైపు లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో చికెన్, గుడ్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement