చర్లపల్లి జైలులోనే రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ : ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైల్లోనే విచారిస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకుంది.
అయితే సెబాస్టియన్, ఉదయ సింహాలను మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు రేవంత్ రెడ్డిని మాత్రం జైల్లోనే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతారని వార్తలు వచ్చినా... చివరి నిమిషంలో అధికారులు తమ వ్యూహం మార్చుకున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.