మండలంలోని ఓ వెంచర్‌లో విద్యార్థినిపై లైంగికదాడిలో పాల్గొన్న నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలి సింది.
లింగాలఘణపురం : మండలంలోని ఓ వెంచర్‌లో విద్యార్థినిపై లైంగికదాడిలో పాల్గొన్న నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలి సింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవా రం రాత్రి నుంచి ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. డీజే సౌండ్స్ సిస్టమ్ ఆపరేటర్ అలీం ఓ విద్యార్థిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. సంఘటనను తీవ్రంగా పరిగణించిన జనగామ డీఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో సీఐ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు బుధవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కీసర దిలీప్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.