కరీంనగర్ హెల్త్ : జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు ఈ నెల 31లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎంఏ.అలీం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తప్పవని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో 400లకు పైగా ప్రైవేట్ హాస్పిటళ్లు ఉండగా, సుమారు 40 ఆసుపత్రులు తాత్కాలిక అనుమతితో కొనసాగుతున్నాయి. ఇవికాకుండా పలు ఆసుపత్రులు అసలను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీనిపై ‘తాత్కాలిక ఆసుపత్రులు’ శీర్షక ఈ నెల 16న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో అదే రోజు నుంచి పలువురు ఆసుపత్రుల ని ర్వాహకులు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి తమ వివరాలను ఎవరు వెల్లడించారంటూ సిబ్బందిని ప్రశ్నించినట్టు తెలిసింది. సాక్షి కథనంతో స్పందించిన ఉన్నతాధికారు లు అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ చట్టం 2002 ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్‌లు, డయోగ్నోస్టిక్ సెంట ర్లు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ(డీఆర్‌ఏ)నుంచి అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హె చ్చరించారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి నిబంధన ప్రకా రం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ ఇస్తామని డీఎం హెచ్‌వో పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో రోగులు పొందే సేవలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవ లు, వారి పేర్లు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఫీజుల వివరాల పట్టికను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూ చించారు. వ్యర్థ పదార్థాల శాస్త్రీయ నిర్వహ ణ, అగ్నిమాపక పరికరాలు, తాగునీటి సదుపాయం వంటి కనీస సౌకర్యాలు లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు
Published Sat, Dec 20 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement