
సాక్షి,రంగారెడ్డి జిల్లా : ప్రగతి నివేదన సభకు ప్రజలు క్షేమంగా హాజరై, తిరిగి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాలు తెలిసేలా అన్ని దారుల్లో ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. 2వ తేదీన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పైకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించబోమన్నారు. సభా ప్రాంగణాన్ని మొత్తం 24 సెక్టార్లుగా విభజించి బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్ ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.