- మండలిలో ప్రభుత్వానికి సభ్యుల వినతి
- చర్యలు తీసుకుంటామని మంత్రుల హామీ
- శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరకుల కల్తీపై ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ముక్తకం ఠంతో విజ్ఞప్తి చేశారు. కేన్సర్ సహా వివిధ రోగాలకు కారణమవుతున్న వారికి ఉరిశిక్ష విధించినా తప్పులేదని సభ్యులు అభిప్రాయ పడ్డారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్త రాల సమయంలో కారం పొడి కల్తీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని కట్టుది ట్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సంబంధిత శాఖల అధి కారులు, అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సభకు వెల్లడించారు. బాలసాని లక్ష్మీనారా యణ మాట్లాడుతూ, ఇటీవల ఖమ్మం జిల్లాలో రెండు లారీల్లో 20 టన్నుల కల్తీ కారాన్ని తెచ్చి రోడ్లపై, సాగర్ కెనాల్ వద్ద పడేశారని, ఇది ఏ కోల్డ్ స్టోరేజీ నుంచి వచ్చింది, బాధ్యులెవరు? వారిపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలన్నారు. దీని వెనక అసలు సూత్రధారులెవరో తేల్చా లని, కల్తీ వస్తువుల గుర్తింపునకు ఆధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని పొంగులేటి సుధాకరరెడ్డి సూచించారు. కల్తీ విత్తనాలు, నూనె, కారం వంటి వస్తువుల కల్తీపై సమగ్ర విచారణ జరపాలని, విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని విపక్షనేత షబ్బీర్ అలీ కోరారు. కల్తీకి పాల్పడే వారిపై పీడియాక్ట్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ సభ్యుడు ఎన్. రామచంద్రరావు సూచించారు.
వైద్య పోస్టుల భర్తీ: లక్ష్మారెడ్డి
వైద్యశాఖలో డాక్టర్లు, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో రోగు లకు మెరుగైన చికిత్స కోసం 30 వెంటిలేటర్లను కొన్నామని, రూ.10 కోట్లతో ఆపరేషన్ థియే టర్లు, ఫర్నిచర్, లిఫ్ట్‌లు, టాయ్‌లెట్ల ఆధునీ కరణకు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ ఆసుపత్రిలో గుండె, కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, అన్ని జిల్లాల్లో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్‌స్కీంను పకడ్బందీగా అమ లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ స్కీం అమలయ్యేలా చూస్తామన్నారు.
గుడుంబా రహిత రాష్ట్రంగా...
గుడుంబా రహిత రాష్ట్రంగా చేసేందుకు వివి«ధ చర్యలను చేపట్టినట్లు మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. గ్రామాల వారీగా నేరస్తులను గుర్తించామన్నారు. గుడుంబా తయారు చేసే కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధికోసం సమగ్ర పునరావాస ప్రణాళికను రూపొం దిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మండలాలు, రెవెన్యూ గ్రామాలు..
ప్రజా డిమాండ్‌కు అనుగుణంగా అన్ని అర్హతలు ఉండీ మండలాలు, రెవెన్యూగ్రామాల ఏర్పాటు విషయంలో దరఖాస్తులు వస్తే పరిశీలిస్తామని మంత్రి ఈటల తెలిపారు.
కల్తీ వ్యాపారులపై చర్యలు చేపట్టాలి
Published Thu, Dec 29 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement
Advertisement