అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోదరుడు అగస్త్య జైస్వాల్ తొమ్మి దేళ్లకే పదోతరగతి పరీక్ష రాసి 7.5 గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాడు.
హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోదరుడు అగస్త్య జైస్వాల్ తొమ్మి దేళ్లకే పదోతరగతి పరీక్ష రాసి 7.5 గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాడు. నైనా జైస్వాల్ కూడా ఎనిమిదేళ్లకే టెన్త్ పూర్తి చేసిన తొలి ఆసియన్ బాలిక గా ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
మెరిట్ స్టూడెంట్‌గా ఉన్న అగస్త్య జైస్వాల్‌ను అతని తల్లిదండ్రులు విద్యాశాఖ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకొని హైదరాబాద్ చాంద్రాయణగుట్ట తాళ్లకుంటలోని సెయింట్ హిల్స్ స్కూల్లో పదోతరగతిలో చేర్పించారు. ఊహించినట్టు గానే అగస్త్య పదోతరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నైనా జైస్వాల్‌తో పాటు ఆమె తండ్రి కూడా పాఠశాలకు చేరుకొని సంబరాలు చేసుకున్నారు.