సాక్షి, రంగారెడ్డి జిల్లా: అతివృష్టి, అనావృష్టితో వరుసగా నష్టాలు చవిచూస్తున్న వ్యవసాయరంగానికి కొత్త సమస్య వచ్చి పడింది. 2013-14 సంవత్సరం ఖరీఫ్ సీజన్ దిగుబడులు చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇందుకు సంబంధించి అంచనాలు రూపొందించిన వ్యవసాయశాఖ.. పరిహారం సంగతి మాత్రం మరిచింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే వాతావరణం అనుకూలిస్తుండడంతో రైతు లు వ్యవసాయపనులు ముమ్మరం చేశారు.
దీంతో పెట్టుబడులు పెట్టాల్సిన కీలక సమయంలో రుణ సహా యం చే సి దన్నుగా నిలవాల్సిన సర్కా రు.. ప్రస్తుతం వెన్ను చూపిస్తోంది. రుణాలు మాఫీ చేసి ఆదుకుంటామని అధికారం చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఈ అంశంపై కాలయాపన చేస్తోంది. ఫలితంగా అదను దాటుతున్నా రైతుకు ఆర్థికసాయం లభించక తల్లడిల్లుతున్నాడు.
భారీ లక్ష్యం.. ఆచరణ అధమం..
రైతులకు విరివిగా రుణాలిస్తామంటూ ప్రణాళికలు తయారు చేసే బ్యాంకులు.. అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు రూ.441.5కోట్ల రుణాలిచ్చేలా వార్షిక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ మొదటివారం నుంచి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తే కొత్తగా తిరిగి రుణం పొందే వెసులుబాటు ఉంటుంది.
కానీ రుణమాఫీపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రూ.30.9 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈలెక్కన లక్ష్యంలో కేవలం 7శాతం మాత్రమే పురోగతి కనిపిస్తోంది.
సాధారణంగా జూన్ మొదటివారం నుంచి వర్షాలు మొదలై సాగుపనులు ఊపందుకుంటాయి. కానీ ఈ సారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు పనులు మందగించాయి. ప్రస్తుతం వానలు కురవడం రైతులకు కొంత ఊరటనిస్తోంది. కీలకమైన వాణిజ్య పంటల సాగుకు ఆటకం కలిగినప్పటికీ.. ప్రస్తుతం ధైర్యంతో ముందుకెళ్తున్న రైతులు రుణాల కోసం బ్యాంకులను ఆశ్ర యిస్తున్నారు. కానీ బ్యాంకులు పైసా విదల్చకుండా మొండికేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదను దాటకముందే రుణాలిచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
విదిలింపు..
Published Wed, Jul 16 2014 11:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement