
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : నమ్మించి మోసం చేసిన అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బాలకిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కస్టమర్, ఏజెంట్‌కు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ వైస్‌చైర్మన్ సీతారాం ఆవాస్‌ను వెంటనే అరెస్టు చేసి బినామి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ప్రధానకార్యదర్శి పి.సురేశ్, జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధ, ప్రధాన కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.