హైదరాబాద్: బీబీ నగర్ పరిధిలోని నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ నెలకొల్పుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. మంగళవారం కేసీఆర్ బీబీ నగర్ నిమ్స్ను సందర్శించారు. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన బిల్లు ప్రకారం కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్ను మంజూరు చేసిందని కేసీర్ చెప్పారు.
బీబీ నగర్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు వందల ఎకరాలకు అదనంగా మరికొంత భూమిని సేకరిస్తానమి కేసీఆర్ తెలిపారు. బీబీ నగర్ ఎయిమ్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. బీబీ నగర్ ప్రాంతంలో వినోద, వ్యాపార, విద్యా సంస్థలతో కూడిన అద్భుతమైన టౌన్ షిప్ నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.
బీబీ నగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్: కేసీఆర్
Published Tue, Jan 20 2015 6:37 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement
Advertisement