మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారుల ఎదుట జిల్లా వైద్యుల సూచన
వనపర్తిటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రులకు అన్ని వసతులు కల్పిం చినప్పుడే కార్పొరేట్ వైద్యం కల సాకారం అవుతోందని జిల్లా వైద్యాధికారులు మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ వెంగళ్‌రావునగర్ కాలనీ మర్రి చిన్నారెడ్డి రిసోర్స్ కాంప్లెక్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెట్రరీ బుద్దప్రకాశ్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారుల సలహాలు, సూచనలు స్వీకరించారు. జిల్లా నుంచి డీసీహెచ్‌ఓ మీనాక్షి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పార్వతి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ ఏరియా ఆస్పత్రి సూ పరింటెండెంట్‌లు, బాదేపల్లి సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగరాజుతో పాటుగా వనపర్తి, ఆమనగల్లు ఎస్పీహెచ్‌ఓలు హాజరయ్యారు. ఆస్పత్రుల్లో కిందిస్థాయి నుంచి రెగ్యులర్ వై ద్యులు, సిబ్బందిని నియమించాలని, గైనకాలజిస్ట్, మత్తు మం దు వైద్యుడు, చిన్న పిల్లల, జనరల్ మెడిసిన్ వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని, అధికభారం పడే గైనకాలజిస్ట్‌లకు ఇన్‌సెంటీవ్ ఇవ్వాలని కోరారు. బెడ్లు, బెడ్‌షీట్స్, కొత్త మంచాలు పది పది చొప్పున ఇవ్వాలని అదేవిధంగా అంబులెన్స్‌తో పా టు అన్ని పరీక్షలు చేసేందుకు అధునాతమైన ల్యాబ్‌లు కావాలని సూచించారు. 24 గంటల పీహెచ్‌సీల్లో కచ్చితంగా నలుగు రు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు, అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తే కుటుంబ నియంత్రన ఆపరేషన్లు, శస్త్రచికిత్సలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఏరియా, పీహెచ్‌సీలకు ప్రస్తు తం ఇస్తున్న మందులు సరిపోవడం లేదని, మందులు అధికంగా ఇచ్చేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.
అన్ని వసతులు కల్పిస్తేనే కార్పొరేట్ వైద్యం
Published Tue, Feb 23 2016 3:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM
Advertisement