మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం | alleged rape attempt by constable in rangareddy distirict | Sakshi

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Published Fri, Feb 27 2015 1:06 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో జరిగింది.

కీసర : ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో జరిగింది. కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి గురువారం రాత్రి కీసర మండలం దొమ్మాయిగూడ గ్రామానికి వచ్చాడు. మాట్లాడాలని చెప్పి తనకు పరిచయం ఉన్న మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు.

మాయమాటలతో కీసర మండలం గోధుమకుంట-చేర్యాల గ్రామాల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని, కానిస్టేబుల్కు దేహశుద్ధి చేసి, అతడిని కీసర పోలీసులకు అప్పగించారు. కీసర్ ఇన్స్పెక్టర్ మహిళను గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోడానికి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement