వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు
నల్లగొండ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
స్థానిక ఎస్సీ కాలనీకి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కాలనీగా నామకరణం చేశారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలో పర్యటించారు. ఉజ్వల గ్యాస్ పథకం కింద ఇంటింటికీ గ్యాస్, ఇంటింటికీ మరుగుదొడ్లు ఉండడం చాలా సంతోషమన్నారు. మోదీ నాయకత్వంలో 107 పథకాలు అమలు అవుతున్నాయని, ఈ కేంద్ర పథకాలు అన్ని గ్రామాల్లో అమలు అయితే గ్రామ స్వరాజ్యం వెల్లివిరుస్తుందన్నారు. తమ గ్రామానికి వచ్చి అమిత్‌షా అభినందించడంతో సర్పంచ్ భాగ్యమ్మ ఆనందం వ్యక్తం చేశారు.