'తెలంగాణలో బీజేపీదే అధికారం' | amit-shah secon day tour in nalgonda district | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో బీజేపీదే అధికారం'

Published Tue, May 23 2017 2:52 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

amit-shah secon day tour in nalgonda district

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని పెద్దదేవుల పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2019 లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ గత రెండు ఏళ్లుగా పోరాటం చేస్తోందని..మోదీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖ ద్వారంగా ఉంటందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధితో పాటు దేశ రక్షణ కోసం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తురన్నారు. మోదీని బలపరచడానికి తెలంగాణ ప్రజలంతా వచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement