హైదరాబాద్ : సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుంటే సహించేది లేదన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులను భయపెట్టే సంస్కృతిని కేసీఆర్ విడనాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్ హితవు పలికారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు సూచించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నమని ఆయన నిన్న హెచ్చరించారు.
'కేసీఆర్ భయపెట్టే సంస్కృతి విడనాడాలి'
Published Fri, May 23 2014 2:59 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement